తూర్పుగంగవరం పీహెచ్సీ రెండవ వైద్యురాలిగా జి. హేనా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పీహెచ్సీ వైద్యురాలిగా మృదుల పనిచేస్తూ ఆమె రాజినామా చేయటంతో పోస్టు ఖాళీ ఏర్పడినది. ఖాళీని భర్తీ చేస్తూ జిల్లా వైద్యాధికారి జి హేనాను నియమించారు. ఆమె బాధ్యతలు స్వీకరించి మర్యాద పూర్వకంగా పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నంను కలిసారు. ప్యామిలీ ఫిజిషియన్తో పాటు పలు బాధ్యతలు ఆమెకు అప్పగించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి రత్నం తెలిపారు.
తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యురాలిగా హేనా
10
Jan