గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దొంగ ఓట్లు తొలగించే వరకూ పోరా టం చేస్తామని పిడిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిం చాలని ఓటర్లను కోరారు. మంగళ వారం దర్శిలోని అనేక గ్రామాలలో ఓటర్లను కలిసి.. పిడిఎఫ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అనంతరం యుటిఎఫ్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ… రాష్ట్రంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏదోరకంగా గెలవాలనే
ఉద్దేశ్యంతో దొంగఓట్లు చేర్పించా రన్నారు. పదో తరగతి, ఇంటర్ అర్హత లున్న వారిని కూడా గ్రాడ్యుయేట్ ఓటరుగా చేర్పించడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికలలో ఓట్లు వేసేవారు గ్రాడ్యుయేట్ గుర్తింపు కార్డు, డిగ్రీ సర్టిఫికేట్, ఉపాధ్యాయ గుర్తింపు కార్డుగా డిడిఒ జారీ చేరి చేసిన సర్వీస్ సర్టిఫికేట్లు చూపించేలా ఎన్నికల కమిషనరు చర్యలు తీసుకుంటే నకిలీ ఓట్ల బెదడ పోయి వాస్తవ ఓటర్లు ఓటు వేస్తారన్నారు. కార్యక్రమంలో యుటి
ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకట రెడ్డి, రాజశేఖర్, మండల అధ్యక్ష, కార్య దర్శులు మీనిగ శ్రీను, రామకోటిరెడ్డి, మండల బాధ్యులు రవికుమార్, వెంటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కురిచేడు మండలం లో…….నిరంతరం ఉదోగ్య, ఉపాధ్యాయ. నిరుద్యోగుల సమస్యలపై పోరాడే వారినే గెలిపించాలని పిడిఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి కోరారు. కురిచేడు మండలంలో మంగళవారం విస్తృతం గానిర్వహించారు. ముందుగా యం.పి.యు.పి. పాఠశాల పడమడర గంగవరం, జడ్.పి. హైస్కూల్ పొట్లపాడు, కురిచేడులోని వై.ఆర్.జడ్.పి. హైస్కూల్, డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, బోధనంపాడులోని హైస్కూల్‌ని సందర్శించి.. అక్కడి ఉపాధ్యాయులను కలిసి.. ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ టి. రాజశేఖర్, జిల్లా కార్యదర్శి డి. వెంకటరెడ్డి, కురిచేడు గౌరవాధ్యక్షులు షేక్ ఖాదర్‌వలి, అధ్యక్షులు అన్నెం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి యు. మాధవరావు, సీనియర్ నాయకులు అల్లాబక్ష్మీరా, ఆర్.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.