తాళ్లూరు ఎబీసీ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, కోఆప్షన్మెంబర్ వలి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డిలు, కోప్షన్మెంబర్ కరిముల్లా, వైద్యాధికారి భాదర్మిస్తాన్ బి , ఎస్సై నరసింహారావు, రిటైర్డు ఉద్యోగుల సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి ఐ. వెంకటరెడ్డి, ఉప సర్పంచి కాశిరెడ్డి, యాడిక శ్రీనివాస రెడ్డి, కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, హెచ్ఎం వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబులు జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు. పండుగల ప్రాధాన్యతను నేటి తరాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను వక్తలు వివరించారు. కళ్లకు కట్టినట్లు సక్రాంతి సంబరాలు నిర్వహించిన యాజమాన్యాన్ని అభినందించారు. బోగి మంటలు వేసారు. చిన్నారులకు బోగి పండ్లతో తలంటు స్నానం చేయించారు. హరిదాస్ల వేషంలో చిన్నారులు ఆలరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించి పలు నృత్యాలు ఆకట్టుకున్నాయి.




























