ప్రజలందరూ సంక్రాంతి పర్వదినాన్ని ఆనందోత్సా హాలతో జరుపుకోవాలని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆకాంక్షించారు. స్థానిక గౌతమిగ్రామర్ స్కూల్లో బుధవారం నిర్వహించిన ముం దస్తు సంక్రాంత్రి వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థు లు వివిధ రకాల వేషధారణలతో అలరించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ కట్టెల పొంగలిని వెలిగించి విద్యార్థులను ఆనందపరిచారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి భోగి మంటలు వేసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. కరెస్పాండెంట్ పి రాజ కేశవరెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఎం భాష, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, సంఘసేవకుడు జి. వి రత్నం పాల్గొన్నారు.



