కంది, పత్తి, వరి, మొక్కజొన్న, శనగ, పొగాకు, మిరప పంటలపై పూర్తిస్థాయి అవగాహన తో రైతులకు సాగు ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకొని లాభాల బాటలో నడవాలని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్, మరియు జిల్లా వనరుల కేంద్రం సమన్వయకర్త కె. అన్నపూర్ణ అన్నారు . దర్శి కృషి విజ్ఞాన కేంద్రం లో కంది, పత్తి, వరి, మొక్కజొన్న, శనగ, పొగాకు, మిరప పంటల సాగు పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆత్మ, మరియు జిల్లా వనరుల కేంద్రం సమన్వయకర్త కె. అన్నపూర్ణ వివిధ పంటలలో విచక్షణ రహితంగా ఎరువులు మరియు పురుగు మందులు వాడటం వలన 50 నుంచి 60 శాతం సాగు ఖర్చు పెరుగుతుందని మరియు దిగుబడి తగ్గి నాణ్యతలేని ఉత్పత్తులను పొందవలసి వస్తుందని, దీనిని అరికట్టడానికి మరియు కేవలము నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం గా రైతులు గుర్తించాలని సేంద్రీయ, జీవన ఎరువుల వాడకాన్ని మరియు పచ్చిరొట్ట పైరుల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు.
కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ N.V.V.S దుర్గాప్రసాద్ పత్తిలో చేపట్టవలసిన సమగ్ర సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు మినుము L B G- 884 రకం, పెసర లో L.G.G-607 రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అని తెలియజేశారు.
వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ బి. ప్రమీల రాణి కొత్తరకం వంగడాలు రైతులకు ఏ విధంగా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందో తెలియజేశారు. కలుపు యాజమాన్యం గురించి వివరించారు.
జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి V. శేషమ్మ .. వరి, మిరప పంటలలో వచ్చే పురుగులు తెగుళ్లు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.
శిక్షణ కార్యక్రమంలో భాగంగా బోట్ల పాలెం గ్రామంలో వరి, మొక్కజొన్న, అలసంద, మిరప, మునగ పంటలను రైతులతో కలిసి పరిశీలించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు.
దర్శి సహాయ వ్యవసాయ సంచాలకులు కే. అర్జున్ నాయక్ , మండల వ్యవసాయ అధికారి V. బాలకృష్ణ నాయక్, , జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి A.శైలజ రాణి, దర్శి మండల గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.




