సిఐటియు అఖిలభారత మహాసభలు ఈనెల 18 నుంచి 22 వరకు బెంగుళూరు లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు పతాకాన్ని దరిశి మండల సిఐటియు అధ్యక్షలు షేక్ కాలే భాష దరిశి సుందరయ్య భవనం వద్ద ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తాండవ రంగారావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం , కనీస వేతనాలు ఇవ్వాలని , సిఐటియు పోరాడుతుందని , కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి , పెట్టుబడి దారులకు అనుకూలంగా , కార్మికులను నష్టపరమైన 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని వీటిపై సిఐటియు దేశ వ్యాప్తంగా సమ్మెలు చేసిందని , కార్మికులను ఐక్యం చేసి మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఈ మహసభలో నిర్నయాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దరిశి మండల కార్యదర్శి ఉప్పు నారాయణ, సివిల్ సప్లై ముఠా , ఆటో , బిల్డింగ్ కార్మిక నాయకులు గోగు వెంకయ్య , ఈమని నాగేశ్వరరావు , పోరుమామిళ్ల కోటేశ్వరరావు , ఆంజనేయులు , శ్రీనివాసరావు , అదెయ్య , రవితేజ పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కోసం సిఐటియు పోరాటాలు
13
Jan