భోగిమంటలతో శనివారం సంక్రాంతి పండుగ శోభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ, రైతుల పండుగ, మన అక్కా చెల్లెమ్మల పండుగ.. మన సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పే అచ్చ తెలుగు పండుగ అని అభివర్ణించారు. పండుగను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు.
ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు
13
Jan