ముండ్లమూరు( మండలంలోని అన్ని గ్రామాలలో అందరూ సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో భాగమైన భోగి పండుగను శనివారం మండలంలోని గ్రామాలలో ప్రజలు ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల్లో నివసించే తెలుగు ప్రజలు సంక్రాంతి సెలవులకు సొంత ఊర్లకు చేరుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో విద్యా ఉద్యోగ వ్యాపారాల రీత్యా వివిధ ప్రదేశాల్లో నివసించేవారు సంక్రాంతి సెలవులకు గ్రామాలకు చేరుకొని బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రతి ఇల్లు అల్లుళ్ళు కోడళ్ళు విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన కొడుకులు కూతుళ్ళతో నిండిపోయి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులపాటు జరుపుకునే సంక్రాంతి పండుగలో భాగమైన మొదటి రోజు భోగి పండుగను వాడవాడల గ్రామాల ప్రజలు ఆనందోహత్సాలతో జరుపుకున్నారు.పండుగ ముందు రోజు శుక్రవారం భోగి మంటలకు కావాల్సిన కట్టల సామాగ్రిని సమకూర్చుకొని శనివారం వేకువజామునే లేచి భోగి మంటలు వేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉల్లాసంగా గడిపారు. మహిళలు పెద్దలు పిల్లలు ఉదయాన్నే భోగి మంటల్లో కాచిన నీటిని తలంటు పోసుకుంటే మంచి జరుగుతుందని పెద్దల నానుడి నూతన వస్త్రాలు ధరించి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇష్టమైన వంటలు చేసుకుని ఇంటిల్లపాది కుటుంబ సభ్యులు భుజించి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంలో మునిగి తేలారు మొత్తం మీద భోగి మంటలలో ఉల్లాసంగా గడిపిన ప్రజలు నేడు సంక్రాంతి ని ఆస్వాదించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
