ముండ్లమూరు గ్రామానికి చెందిన మేదరమెట్ల గోపాలరావు మనవడు మేదరమెట్ల అనిల్ కుమార్ సైకిల్ యాత్ర ద్వారా పర్యటన చేస్తూ రికార్డు లు సృష్టిస్తున్నాడు. వివరాలలోకి వెళితే మేదరమెట్ల అనిల్ కుమార్ పూర్వం గ్రామము ప్రకాశం జిల్లా ముండ్లమూరు కాగా ప్రస్తుతం గుంటూరు జిల్లా లింగంగుంట గ్రామంలో నివాసం ఉంటూ గుంటూరులో ఉంటున్నారు. ఆయన సైకిల్ పై భారతదేశంలో యాత్ర చేస్తూ సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈరోజు సోమవారం గుంటూరు నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి వినుకొండ. కురిచేడు. దర్శి. ముండ్లమూరు. అద్దంకి. రేణింగవరం మీదుగా బైపాస్ కు చేరుకొని అక్కడనుండి గుంటూరుకు రాత్రి 9 గంటలకు చేరుకుంటానని ఆ తెలిపారు .ఈ తరుణంలో విశాలాంధ్ర విలేకరి ముండ్లమూరులో ఆయన పలకరించగా పర్యావరణం పై ప్రజలకు అప్రమత్తం చేసేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా భారతదేశంలో అనేక ప్రాంతాలలో సైకిల్ యాత్ర చేశానని అనుకున్న లక్ష్యం మేరకు రికార్డులు సాధించాలని తెలిపారు. అందులో2022 నవంబర్ డిసెంబర్ నెలలో కలకత్తా .కన్యాకుమారి 12 మంది సభ్యులు 3700 కిలోమీటర్లు తిరిగి వారిచ్చిన సమయ కంటే ముందే వెళ్లే రికార్డులు సాధించామన్నారు. మరల కలకత్తా. ఢిల్లీ .బాంబే. చెన్నై.6000 కిలో మీటర్లు అనుకున్న సమయం కంటే ముందే వెళ్లి రికార్డు సాధించామన్నారు. మరల అడాక్స్ ఫ్రాన్స్ ఒప్పందంతో ఆపకుండా 1000. 1200 కిలోమీటర్లు 90 గంటల్లో పూర్తి చేయాల్సి ఉండగా అనుకున్న దానికంటే 80 గంటల్లో పూర్తి చేసి రికార్డు సాధించామన్నారు. అదేవిధంగా హైదరాబాద్ టు ఆర్సిల్ 500 కిలోమీటర్లు ఆర్సిల్ టు హైదరాబాద్ 500 మొత్తం 1000 కిలోమీటర్లు 75 గంటల్లో పూర్తి చేయాల్సి ఉండగా ముందుగా నే 72 గంటల్లో పూర్తి చేసి రికార్డు సాధించాడు . మరల 2023 జనవరి 16 న సోమవారం ఉదయం 9 గంటలకు గుంటూరు నుండి బయలుదేరి దర్శి ముండ్లమూరు రేణింగవరం మీదుగా గుంటూరుకు 200 కిలోమీటర్లు పూర్తి చేస్తానని తెలిపాడు .
పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్ర
16
Jan