ఒంగోలు లోని గద్దలగుంట పారువేట కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవం రంగారాయుడు తెప్పోత్సవం అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు గద్ద లగుంట పారువేటకు వచ్చారు. గద్దలగుంట ముఖ ద్వారంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవ రావు నేతృత్వంలో ఏర్పాటైన పాటకచ్చేరికి బాలి నేని, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గద్దల గుంటలోని నాగార్పమ్మతల్లి, అంకమ్మ తల్లి ఆల యాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, శ్రీకోదండ రామస్వామి ఆలయం, అంకమ్మ తల్లి ఆల
యాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన పాటకచ్చేరి కార్యక్రమానికి బాలినేని, మాగుంట ఇరువురు హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సంయుక్తంగా వాల్తేరు. వీరయ్య సినిమా కేక్ను కట్ చేశారు. బాలినేని శ్రీని వాసరెడ్డి మాట్లాడుతూ ….ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయం మొత్తం అభి వృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి వేగం అవుతుంద న్నారు. చిరంజీవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, ఆయన సినిమాలు సక్సెస్ కావాలనికోరుకుంటున్నామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ… చిరంజీవితో తమ కుటుంబానికి మంచి బంధం ఉందని అన్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ప్రస్తుతం
బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీరయ్య గా చిరం జీవి అభిమానులు పేర్కొంటుండడం మరింత ఆనందంగా ఉందన్నారు. అనంతరం అక్కడ నుం చి గాంధీబొమ్మ సెంటర్లో 32వ డివిజన్ కార్పొరే టర్ తాడి కృష్ణలత ఏర్పాటు చేసిన పాటకచ్చేరిలో ఇరువురు పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని, మాగుం టను వైఎస్సార్ సీపీ నాయకులు ఓగిరాల వెంకటే ట్రావు, తోటపల్లి సోమశేఖర్, కార్పొరేటర్ తాడి కృష్ణలతో సత్కరించారు. రాజరాజేశ్వరస్వామి అమ్మవారు, గద్దలగుంట ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇరువురు గద్దలగుంట నెహ్రూబొమ్మ సెంటర్లోని పాట కచ్చేరిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘట నలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు.
చిన్నతనం నుంచే పారువేటతో అనుబంధం –
పారువేటలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
16
Jan