గ్రామాల్లో జగనన్న కాలనీల ద్వారా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ హనుమంతరావు అన్నారు. మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల వద్ద శుక్రవారం హౌసింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి204 ఇల్లు పూర్తిచేసి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలన్నారు. అవసర మైన వారికి మెటీరియల్ అందిస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి సకాలంలో బిల్లు లు చెల్లిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పూరి మెట్ల సర్పంచి ఓగులూరీ రామాంజి. మారెళ్ళ సర్పంచి గోపన బోయిన శ్రీనివాసరావు. ఏపీఎం హనుమంతరావు. ఏపీవో కొండయ్య. వీఆర్వో గురవయ్య. సచివాలయ సిబ్బంది. హౌసింగ్ సిబ్బంది. వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలి
20
Jan