ప్రతి ఒక్క వాహనదారుడు ప్రభుత్వం నిర్దేశించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై ఎల్ సంపత్ కుమార్ అన్నారు మండల కేంద్రమైన ముండ్లమూరులో శనివారం వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణ సమయాలలో ద్విచక్ర వాహనదారుడు తలకు హెల్మెట్ ధరించాలని. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ప్రతి ఒక్క వాహనాలకు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలుకెళ్లడం తప్పదన్నారు. వాహనదారుడు అతివేగం వెళ్లడం ప్రమాదకరమన్నారు. వాహనదారులు ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకుని ప్రయాణం సాగించాలన్నారు . అతివేగంతో వెళుతూ ఏదైనా ప్రమాదం జరగరాని జరిగితే మీ కుటుంబాలు రోడ్డున పడతాయని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు. మహేష్ .మరియబాబు. ఏసుబాబు. ప్రేమానిది తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
21
Jan