వచ్చే దసరాకల్లా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం జరుగుతుందని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడుతూ నూతన కార్యాలయ నిర్మా ణానికి భూమిపూజ చేయడం ఆనందంగా ఉంద న్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్ సీపీ కార్యాలయాలను ఒకే డిజైన్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. పార్టీ కార్యా లయం నిర్మాణం వల్ల పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో మనోధైర్యం నెలకొంటుందని కార్యాలయాల నిర్మాణం మొత్తం ప్రక్రియను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో నిర్మించే అన్నింటినీ దసరా రోజు ప్రారం భిస్తారన్నారు. పార్టీ బలోపేతానికి ప్రస్తుతం అత్య ధిక ప్రాధాన్యత చర్యలు తీసుకుంటున్నారని, అం దులో భాగంగానే ఎమ్మెల్యేల బలోపేతానికి చర్యలు
ఉంటున్నాయన్నారు.
వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలను వైఎస్సా ర్సీపీ గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. పార్టీ బలోపేతంగా ఉంటే అందులో ఉండే ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఉండే భరోసా చెప్పలేనిదని, అది మర్చి పోరాదని అన్నారు.వైఎస్సార్సీపీలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారని, అందుకు నిదర్శనం 9 రాజ్యసభ ఎంపీ సీట్లు ఉంటే అందులో 4 సీట్లు బీసీ లకుకేటాయించడమేనన్నారు. ఉప ముఖ్యమం త్రుల్లో సైతం ఐదుగురికిగాను నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారన్నారు. చివరకు స్పీకర్ పదవిని కూడా బీసీలకు కేటాయించారని, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు తదితరాల్లో సైతం 75 శాతం పదవులు అట్టడుగు వర్గాలకే దక్కా యన్నారు. గతంలో ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, మహిళలకు సైతం సామాజిక న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రతి ఒక్కరూ అండగా ఉండేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా అలుపె రగని పోరాటం చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటూ సుదీర్ఘప్రయాణాన్ని కొనసాగించామన్నారు. ఈ నేపథ్యం లోనే పార్టీ నాయకులు, కార్యకర్తలకు శాశ్వత కార్యా లయం ఉండడం ద్వారా పార్టీని మరింతగా బలో పేతం చేయడం సాధ్యమవుతుందని భావించి పార్టీ కార్యాలయ నిర్మాణంలో అడుగు ముందుకు వేయడం శుభపరిణామమన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు పునాది రాళ్లు వేసి ప్రజ లను మభ్యపెట్టాలనుకోవడం చంద్రబాబు పని అని విమర్శించారు. ఎన్టీఆర్ కంటే ముందే వెలిగొండ ప్రాజెక్టు ఆకాంక్ష పశ్చిమ ప్రకాశంలో ఉందని, కానీ 1996 మార్చిలో ఎన్నికలు వస్తున్నాయనగా చంద్ర బాబు హడావుడిగా శిలాఫలకం మాత్రమే వేశార న్నారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు కేటాయించి పనులు వేగవంతం చేస్తే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక టన్నెల్ పూర్తిచేసి రెండో టన్నెల్ పూర్తిచేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారన్నారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును సైతం ప్రారంభించుకుంటామని, కళ్లుం డి అభివృద్ధిని చూడలేని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మన లక్ష్యం మాత్రం 175 సీట్లు గెలుచుకోవడమే అని, ఆ దిశగా పార్టీ నాయ కులు, కార్యకర్తలు, జగనన్న సైన్యం సేవలు ఉం డాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీపోతుల సునీత, ఎమ్మెల్యేలు కుందురు నాగార్జున రెడ్డి, డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, అన్నా రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, కరణం బలరామకృ ష్ణమూర్తి, నగర మేయర్ గంగాడ సుజాత, వ్యవ సాయ, మార్కెటింగ్ విభాగం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీమంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూ రావు, కసుకుర్తి ఆదెన్న, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోబ్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, మేదర కార్పొరేషన్ చైర్ వర్సన్ కేతా లలిత నాంచారమ్మ, దేవాంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర, చాత్తాడ శ్రీవైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కుమార్, మాదిగ కార్పొ రేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, గ్రంథా లయ సంస్థ రాష్ట్ర చైర్మన్ ఆదిశేషగిరిరావు, వైఎస్సార్ సీపీ ఎంఎల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సిపి నాయకులు పాల్గొన్నారు.
గడప గడపలోను జగనన్న అభిమానులు -ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి
ప్రతి గడపలోనూ జగనన్న అభిమానులు ఉన్నారని.. తప్పుడు ప్రచారాలు చేస్తూ అవాస్తవా లతో మభ్యపెట్టాలనుకున్న వారి ప్రచారానికి తెరవే యడమే లక్ష్యంగా జగనన్న సైనికులు పనిచేయాలని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినే టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జగనన్న సచివాలయాల ,మండల/క్ల స్టర్ కన్వీనర్లకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సైన్యంలో పనిచేసే ప్రతి వ్యక్తి పేరు జగనన్న మదిలో ఉంటుందని, మీరు నేరుగా జగనన్న సైన్యం అని గుర్తుంచుకుని పనిచేయాలన్నారు. ప్రతి నియోజకవ ర్గంలోను పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృ షి కొనసాగాలన్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ ని పెంచాలనే లక్ష్యంతోనే గడప గడపకు మన ప్రభుత్వ కార్య క్రమానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకునేందుకే ఈ కార్యక్రమమన్నారు. మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం పనిచేస్తున్న వలం టీర్లు సచివాలయాల పరిధిలో ప్రతి 50 ఇళ్లకు ఒకరుగా ఉంటూ గౌరవ వేతనం పొందుతూ సేవలు అందిస్తున్నారన్నారు. అయితే వారి సేవలకు ఒక గుర్తింపు లభించింది సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల కావడం తో వారికి సాధారణంగా వైఎస్సార్ సీపీ పట్ల అభి మానం ఉండడంలో తప్పులేదన్నారు. అంత మాత్రాన వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తూ పచ్చ పత్రికలు రాస్తున్న రాతలను తిప్పికొట్టేందుకే జగనన్న సైన్యాన్ని రూపొందిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు మాట్లా డుతూ …2024 పార్టీ ఎన్నికల్లో జగనన్న సచివాలయ కన్వీనర్లు కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంద న్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కృషి చేస్తు న్నారని, కానీ జగనన్న సచివాలయ వలంటీర్లు మాత్రం పార్టీ ఇమేజ్ పెంచేందుకు, ఎక్కడైనా సమ స్యలుంటే తక్షణమే పార్టీ దృష్టికి తీసుకురావడం
ద్వారా న్యాయం చేసేందుకు చర్యలు వేగవంతం అవుతాయన్నారు. రెండు రోజులపాటు నియోజకవ ర్గాల వారీగా కూడా మండలాల కన్వీనర్లతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ … పార్టీకి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ వైఎస్సా ర్సీపీ గెలుపులో కీలకంగా జగనన్న సైనికులు పనిచే యాలన్నారు. వలంటీర్ల వ్యవస్థపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ప్రతి మండల పరిధిలో కనీసంగా 800 నుంచి వెయ్యిమంది సిద్ధం కావాలన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ ..బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యో తిగా నిలిచిన వైఎస్సార్సీపీ విజయంలో కీలక పాత్ర పోషించబోతున్న జగనన్న సైనికులకు శుభాకాం క్షలు తెలిపారు. జగనన్న సచివాలయాల రాష్ట్ర కోఆ ర్డినేటర్ శివశంకరరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు రథసారథులు, ప్రతి గ్రామంలో ముగ్గురు వలంటీర్లు, మండలానికి ఒక కన్వీనర్లు అందరూ స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే మండల కన్వీనర్ల నిర్మాణ ప్రక్రియ 90 శాతం పూర్తయిందని, మిగిలిన వారిని సైతం ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా గృహ రథసారథుల ఎంపికకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 2.60 లక్షల మంది వలం టీర్లు ఉన్నారని, కానీ వైఎస్సార్సీపీ వద్ద, జగనన్న సైన్యంలో 5.20 లక్షల గృహ సారథులు అం దుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇక వలంటీర్లు, మండల కన్వీనర్లు కలుపుకుంటే 26 జిల్లాలో 8 లక్షల సైన్యంఉండబోతుందంటూ మండల కన్వీనర్ల బాధ్యతలు, విధి విధానాలు తదితరాలపై అవగా హన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్ యాదవ్, కుందురు నాగార్జున రెడ్డి, డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, నగర మేయర్ గంగాడ సుజాత, కొండపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు, పరిశీలకులు ఆదిశేషగిరి రావు పాల్గొన్నారు.



