కురిచేడు- వినుకొండ ఆర్ అండ్ బి రోడ్లో ఆదివారం రాత్రి బైకన్ను ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొన్న సంఘటనలో పంచాయితీ కార్మికుడు కంభంపాటి సాయన్న (28) మృతి చెందాడు. కురిచేడు ఎస్సీ కాలనీకి చెందిన సాయన్న పంచాయితీ కార్యాలయంలో వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ రాత్రి విధులు ముగించుకుని నివాసానికి వెళ్లు సమయంలో ప్రమాదం జరిగినది. సాయన్న తలకు తీవ్ర గాయాలు కావటంతో 108లో వైద్యశాలకు తరలించే లోపే | మృతి చెందాడు. ఆయనకు వివాహమై సంవత్సరం కూడ పూర్తి కాక పోవటంతో కుటుంబం, బంధు మిత్రులు విషాదంలో మునిగి పోయారు. ఎస్సై దేవకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ నాయకులు….
ప్రమాదంలో మృతి చెందిన కంభంపాటి సాయన్న కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్ర ఫిషరీస్ కోఆర్డినేటర్ షేక్ సైదా, మాజీ ఎంపీపీ ఏరువ సుబ్బారెడ్డిని పరామర్శించారు. వారి కుటుంబానికి సైదా రూ.10వేల రూపాయలు, సుబ్బారెడ్డి 5 వేలు నగదును తాత్కాలిక సహాయం అందించారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు సాల్మన్, గౌరవ అధ్యక్షుడు సందు వెంకటేశ్వరరావులు సభ్యులు సందర్శించి సాయన్న మృత దేహానికి నివాళులు అర్పించారు. సంఘానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ముందుగా సిఐటియు మండల కమిటి గౌరవాధ్యక్షులు సందు,వెంకటేశ్వరరావు సాయన్న భౌతిక కాయానికి పూలమాల వేసి జోహార్పించారు.
కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల అధ్యక్షులు గండి శ్రీను,నాయకులు ఎల్.అశోక్ కుమార్,శిఖా గురవయ్య,శాంసన్,సుబ్బారావు,మోడి నాగేశ్వరరావు,ఏసుదాసు,ఆశావర్కర్లు యూనియన్ండల అధ్యక్షురాలు యు.కొండమ్మ,ఎస్ కె.గౌసియా,వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



