తెలుగుదేశం పార్టీ జాతీయకార్యదర్శి, మాజీ మంత్రినారాలోకేష్ పుట్టిన రోజు వేడుకలు తాళ్లూరు మండలటీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహాం వద్ద టీడీపీ శ్రేణులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భం గా ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి మానంరమేష్ బాబు మాట్లాడుతూ …నారా లోకేష్ పాదయాత్ర తో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలు బయట పడతాయన్న కారణంతో పాదయాత్రకు ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా లోకేష్ పాదయాత్ర చేసితీరుతారని, ప్రభు త్వ విదానాన్ని ఎండగట్టడం ఖాయమన్నారు. ప్రజలు నారా చంద్రబాబు నేతృత్వం విదానాన్ని ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం ఖాయమన్నారు. ప్రజలు నారా చంద్రబాబు నేతృత్వం లోని అభివృద్ధి పాలనకోసం ఎదురుచూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి మానం రమేష్ బాబువ్,టీడీపీ సీనియర్ నేతలు తూము శివనాగిరెడ్డి, కైపు రామకోటిరెడ్డి, ఇడమకంటి శ్రీనివాసరెడ్డి, పిన్నిక రమేష్ బాబు, ముప్పనేని తిరుపతిస్వామి, చంద్రగిరి గుర్వారెడ్డి, నల్లపాటి సత్యం, నుసుం ఆదినారాయణరెడ్డి, బొడ్డుహనుమారెడ్డి, రామచంద్రారెడ్డి, కైపు నాగార్జునరెడ్డి, మానం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
