కల్తీలకు పాల్పడితే జైలే
-డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి
ఆహార పదార్థాల విషయంలో కల్తీలకు పాల్పడితే జైలు పాలు కావాల్సిందేనని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి హెచ్చరించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసారు. స్థానిక పోలీసుస్టేషన్ లో సోమవారం విలేకరుల సమా వేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. వినుకొండ మండలం శావల్యాపురం గ్రామానికి చెందిన బోయపాటి పూర్ణ చంద్రరావు కొంతకాలంగా దర్శి నగర పంచాయతీలోని ఎల్ ఐసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అక్కడ పాల సెంటర్ పెట్టుకుని పాడిరైతుల వద్ద పాలు సేకరిస్తూ కేంద్రాలకు పం పుతున్నాడు. కల్తీపాలు తయారు చేయడం నేర్చుకుని కేం ద్రానికి పంపే పాలలో కల్తీ పాలు కలపి పంపుతున్నాడు. విషయం తెలుసుకున్న కొందరు ఫిర్యాదు చేశారు. డీఎస్పీకి అందించిన సమాచారం మేరకు.. ఆహార భద్రతా అధికారి నరశింహుడుతో పాటు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడ సన్ఫ్లవర్ ఆయిల్, ఉప్పు ఇతర పదార్థాలతో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కల్తీ పాలు తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులను, పాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. తయారు చేసిన కల్తీ పాలను ల్యాబ్ కి పంపి ఆహార భద్రతా అధికారుల ద్వారా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్ర మంలో సీఐ రామకోటయ్య. ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.

