ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేర్చాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం మండల వైసీపీ సచివాలయ కన్వీనర్ గా ఎంపికైన మేడికొండ జయంతి ఆధ్వర్యంలో సచివాలయ కన్వీనర్. మండల నాయకులు కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణు గోపాల్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందించమన్నారు. మండల వైసిపి సచివాలయ కన్వీనర్ మేడికొండ జయంతి ఆధ్వర్యంలో కలసికట్టుగా పనిచేసి సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించి తిరిగి 2024లో వైఎస్ఆర్సిపి గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అనంతరం వైసిపి మండల సచివాలయ కన్వీనర్ మేడికొండ జయంతి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ కు పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి. జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు. వైసిపి మండల యువ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి సొసైటీ డైరెక్టర్ జిల్లెల మూడీ శివయ్య. ముండ్లమూరు మాజీ సొసైటీ అధ్యక్షులు బద్రి సుబ్బారెడ్డి. మండల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు దాసరి మురళి. శంకరాపురం సచివాలయ మహిళా కన్వీనర్ మందలపు రాధా. పూరి మెట్ల సర్పంచి ఓ గులూరు రామాంజి. పసుపు గళ్ళు సర్పంచి వరగాని బాలసుందర్రావు, కార్తికేయ కన్స్ట్రక్షన్ అధినేత కుంచాల నాగరాజు. ముళ్ళమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి. గోపన బో యిన పిలుపు రాజు. మందలపు అశోక్( ఫీల్డ్ అసిస్టెంట్) మందలపు వెంకటరావు. మేడికొండ కృష్ణ. గురజాల కృష్ణ. నంబూరు శ్రీను. ఉల్లగల్లు సర్పంచి జనమాల నాగేంద్రం పిచ్చయ్య. తదితరులు పాల్గొన్నారు.

