జగనన్న పాలనలో సంక్షేమ పథకాల అమలులో అవినీతి ఆరోపణలు లేకుండా నేరుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదల ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు జమ చేసి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మూడు సంవత్సరాల కాలంలో 95% శాతం పైగా ఇచ్చిన హామీలను అమలు చేశామని ప్రజలు ఆశీర్వదించాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కోరారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో మంగళవారం ఆ గ్రామ సర్పంచి వరగాని బాల సుందర రావు . ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి. జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్నం రాజు. మండల వైసీపీ యువ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షతన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం రెండవ రోజు ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలు వృద్ధులు వికలాంగులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కులం మతం పార్టీలు వర్గాలు అనే వివక్షత లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన అన్నారు. ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన లబ్ధిని వివరించారు. గ్రామ సచివాలయాల పనితీరును గ్రామాల్లో వాలంటీర్లు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.సంక్షేమ ఫలాలు అమలు మరింత వేగవంతం అయ్యేలా ముఖ్యమంత్రి జగనన్న పార్టీ నేతలను నియమించాలన్నారు. మండల సచివాలయ కోఆర్డినేటర్లను ప్రతి సచివాలయానికి ముగ్గురు సమన్వయ కర్తలను ప్రతి వాలంటీర్ కు ఇద్దరు గృహ రథసారథులను నియమించి సంక్షేమ ఫలాలు అర్హులందరికీ నూరు శాతం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ సచివాలయ కోఆర్డినేటర్ మేడికొండ జయంతి. ముళ్ళమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి. ముండ్లమూరు మాజీ సొసైటీ అధ్యక్షులు బద్రి సుబ్బారెడ్డి. పూరి మెట్ల సర్పంచి సర్పంచి ఓ గులూరు రామాంజి. నూజిలపల్లి సర్పంచి చొప్పరపు వెంకటేశ్వర్లు. ఉల్లగల్లు సర్పంచి జనమాల నాగేంద్ర పిచ్చయ్య. ఉమామహేశ్వర పురం సర్పంచి వేముల పద్మావతి శ్రీనివాసరావు. సొసైటీ డైరెక్టర్ జిల్లెలముడి శివయ్య. గోపన బోయిన పిలుపు రాజు. చింతా వెంకట శ్రీనివాసరెడ్డి. గర్నెపూడి ప్రసన్న కుమార్. తదితరులు పాల్గొన్నారు .



