తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పలువురి జాతీయ నాయకుల, సేవకుల విగ్రహాలు గురువారం ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర సమర యోథుడు ఇడమకంటి బ్రహ్మా రెడ్డి ధార్మిక మండలి ఆధ్వర్యంలో మాజీ సర్పంచి ఇడమకంటి పెద్దిరెడ్డి, సీపీ బ్రౌన్ సేవా సమితి చైర్మన్ ఐ. లక్ష్మిరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, భారత రత్న మధర్ థెరిస్సా, భారత రత్న అబ్దుల్ కలాం గార్ల విగ్రహాలను లక్ష్మిరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసారు. ఆయా పనులను ఇప్పటికే వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి పూర్తి చేయించి ప్రారంభభోత్సవానికి సిద్దం చేసారు. గ్రామంలో లేని ప్రత్యేకమైన జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు పట్ల పలువురు విద్యావేత్తలు, మిత్రులు విగ్రహ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.
