రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలలో ముండ్లమూరు విద్యార్థిని దుర్భాకుల సాయి విధాత్రి పాల్గొననున్నారు. ఢిల్లీలో జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంపికైన అతి కొద్ది మందిలో ఎన్ సి సి జూనియర్ విభాగం నుండి సాయి విధాత్రి స్థానం దక్కించుకుంది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ముండ్లమూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు దుర్భాకుల వెంకట సుబ్బారావు కుమారుడు దుర్భాకుల చక్రపాణి ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె సాయి విధాత్రి తొమ్మిదవ తరగతి విద్య అభ్యసిస్తూ చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరుస్తూ ఉండడం విశేషం. విద్యార్థిని ప్రతిభ గుర్తించి రిపబ్లిక్ డే దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు. ఉద్యోగులు బంధువులు అభినందనలు తెలిపారు.
