జగనన్న పాలనలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మండలంలోని పసుపు గళ్ళు పంచాయతీ పరిధిలో గల చింతలపూడి గ్రామంలో బుధవారం మూడవ రోజు కార్యక్రమం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఆ గ్రామ సర్పంచ్ వరగాని బాల సుందర రావు. ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి, జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్న రాజు , మండల వైసీపీ యువ నాయకులు బిజ్జం వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ….. ప్రభుత్వం అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల కోసం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కి దీటుగా 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. కుల మత వర్గ వి బేదాలకు తావు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. వృద్ధుల మహిళలకు పార్టీల కు అతీతంగా పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతుందన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు లక్ష నుండి మూడు లక్షల వరకు అందాయని అన్నారు. 2024 లో రాబోయే ఎన్నికలలో మరల జగనన్న ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పసుపుగల్లు ఎంపీటీసీ దాసరి పెద్ద అంజయ్య, ముండ్లమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్ రెడ్డి, ఉలగల్లు సర్పంచ్ జనమాల నాగేంద్ర పిచ్చయ్య, సొసైటీ డైరెక్టర్ జిల్లెలమూడీ శివయ్య, నూజిలపల్లి సర్పంచ్ చో ప్పరపు వెంకటేశ్వర్లు, చింత వెంకట శ్రీనివాస్ రెడ్డి, పూరి మెట్ల సర్పంచ్ ఓగులూరు రామాంజి పాల్ తదితరులు పాల్గొన్నారు .


