ఎబీసీ హైస్కూల్లో ఘనంగా రిపబ్లిక్ డే నిర్వహణ – దేశ ప్రగతికి కృషి చెద్దాం. ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి – ఘనంగా గణతంత్ర్య దినోత్సవం నిర్వహణ

ప్రకాశం జిల్లా, దర్శి నియోజక వర్గం, తాళ్లూరు మండలంలో తాళ్లూరులోని ఎబీసీ ఉన్నత పాఠశాలలో గురువారం గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు జెండాను ఎగుర వేసారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జాతీయ సమగ్రత ప్రతి పౌరుడు దేశ ప్రగతికి కృషి చెయ్యాలని కోరారు. నాడు స్వరాజ్య సాధనకు కృషి చేసారని, నేడు సురాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని దేశ ప్రగతిలో యువత ప్రాధాన్యత వెలకట్టలేనిదని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ నాయకుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి చిననాటి నుండి లక్ష్యాలను ఏర్పరుచుకుని సాధనకు కృషి చెయ్యాలని అన్నారు. క్రమ శిక్షణలో పనిచేస్తే సాధ్యమం కానిది లేదని అన్నారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించి వారి ఆశయ సాధనకు కృషి చెయ్యాలని, గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషాబాబులు గణతంత్రదినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు (ఎస్.ఏ)లు యలమందారావు, చిన్నయ్య, కొండల రావు, వెంకటరావు, స్వరూపరాణి, రాణి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *