దేశ నాయకులు, సంఘ సేవకుల సేవలను గుర్తు చేస్తూ వారి విగ్రహాలను స్వాతంత్య్ర సమర యోధుడు ఇడమకంటి బ్రహ్మా రెడ్డి ధార్మిక మండలి, సీపీ బ్రౌన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం అభినందనీయమని వక్తలు అన్నారు. తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద సీపీ బ్రౌన్ సేవా సమితి చైర్మన్ ఐ. లక్ష్మిరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, భారత రత్న మథర్ థెరిస్సా, భారత రత్న అబ్దుల్ కలాంల విగ్రహాలను గురువారం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, సీపీ బ్రౌన్సేవా సమితి అధ్యక్షుడు ఐ. లక్ష్మిరెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ వెంకటేశ్వర రెడ్డి, ఎం. ఎన్పీ నాగార్జున రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ ఐ. వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ కెవైకీర్తి, తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎస్సై ప్రేమ్ కుమార్, వైద్యాధికారి బాదర్ మస్తాన్ బి , ఎంఈఓ జి. సుబ్బయ్య, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి. పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, నిశంకం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

