74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాళ్లూరు మండలం తాళ్లూరు అంబేద్కర్ నగర్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద గురువారం మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా. అంజయ్య మరియు అంబేద్కర్ యూత్ సంఘం తరఫున గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాళ్లూరు సబ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసిన తరువాత ఎస్సై ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం విశిష్టత గురించి అంబేద్కర్ కల్పించిన హక్కులు గురించి మాట్లాడినారు దారా అంజయ్య మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరముల 11 నెలల 18 రోజులు కష్టపడి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించడం జరిగినది అందువలన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పించాలన్నారు. పాలే పోగు. డగ్లెస్ మాట్లాడుతూ .. సమానమైన పనికి సమానమైన వేతనం ఉండాలని మహిళలకు రాజ్యాంగం ద్వారా హక్కలు ప్రసాదించిన గొప్ప రాజ్యాంగ రూపశిల్పి అని కొనియాడారు MPTC.2 యమర్తి ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రతి మనిషికి ఓటుతో గుర్తింపు వస్తునదని అందరికీ ఓటు హక్కు కల్పించి చదువు ద్వారానే మనిషికి జ్ఞానం విలువ వస్తుందని మొట్టమొదటి ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా చేసిన గొప్ప రాజ నీతిజ్ఞుడని కొనియాడారు. పులి వికాస్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు రిజర్వేషన్లు మరియు అన్ని కులాలకు కూడా ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్ గారిదే నన్నారు . కార్యక్రమంలో మహిళా పోలీస్ దారా సోనీ ప్రియా పులుగు నిరీక్షణ రావు చుక్క నాని మరియు అంబేద్కర్ యూత్ ఫోర్స్ స్కూలు విద్యార్థులు విద్యార్థులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకునే అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.

