ముండ్లమూరు మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ముండ్లమూరు లోని పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ జండా ఎగరవేసి జండా వందనం స్వీకరించారు. మారెళ్ళ ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద వైద్యాధికారులు వి జ్యోతి. ఎం జాస్మిన్. సిహెచ్ ప్రవీణ్ కుమార్. బి మధు శంకర్. పశువైద్యశాల వద్ద పశువైద్యాధికారులు కాశిరెడ్డి ఎం విజయ లక్ష్మి. మారళ్ళ సచివాలయం వద్ద ఆ గ్రామ సర్పంచ్ గోపన బోయిన వెంకటేశ్వర్లు. మారెళ్ళ హైస్కూల్ వద్ద ఎస్ఎంసి చైర్మన్ నల్లబోతుల రామాంజనేయులు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఏ ఈ జె భూరాజు. ముండ్లమూరు రైతు భరోసా కేంద్రం వద్ద ముండ్లమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి జండాలు ఎగురవేసి జండా వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాటాల ఫలితంగానే రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సచివాలయం మహిళా పోలీసులు పాల్గొన్నారు.

