గృహ సారథులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు చెంతకు తీసుకెళ్లి పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని జెసిఎస్ మండల సచివాలయ కన్వీనర్ యాడ్క శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మండలంలోని మల్కాపురం, కొర్రపాటివారిపాలెం, మాధవరం గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి గృహ సందర్శకులకు విశానిర్దేశం చేశారు. ఆయా కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, సర్పంచ్ వలి, సీనియర్ నాయకుడు చిన ఆంజనేయులు , యువ నాయకుడు విష్ణు , మాజీ ఎంపీటీసీ నగల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మల్కాపురం ఆంజనేయ స్వామి వద్ద జేసీఎస్ మండల సచివాలయం కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.



