ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో గల ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహానికి 1000 లీటర్ల సామర్థ్యం గల నీళ్ల సింటెక్స్ ట్యాంకును మండల జడ్పిటిసి సభ్యులు , ప్రకాశం జిల్లా సోషల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు తాతపూడి మోజెస్ రత్నం రాజు బహుకరించారు. శుక్రవారం ఎస్సీ బాలుర వసతి గృహానికి చేరుకొని హాస్టల్ వార్డెన్ భూమా నరసింహారావుకు మంచి నీటి ట్యాంకును అందజేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ .. విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ ట్యాంక్ ను బహుకరించడం జరిగిందన్నారు . విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
హాస్టల్ కు వాటర్ ట్యాంకు ను భాహుకరించిన జడ్పిటిసి సభ్యులు తాతపూడి మోజెస్ రత్నం రాజు
27
Jan