జగనన్న కాలనీలలో గృహాలు త్వరితగతిన పూర్తి చేయించే విధంగా అవసరమైన చర్యలను తీసుకోవాలని జిల్లా మార్కేట్ ఫెడ్ డిడి, మండల ప్రత్యేక అధికారి ఉపేంద్రకుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో అన్ని పంచాయితీలలో 395లో 35 పూర్తి అవగా మరో 104 జగనన్న గృహాలు నిర్మాణం పూర్తి కావాలని తెలిపారు. ఉగాది నాటికి పూర్తిగా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. రుణ సహాయం కావాల్సిన వారు పొదుపు సంఘాల ద్వారా త్వరగా పొందేలా చూడాలని, ఎస్సీ ఎస్టీలకు రూ. 50వేలు, ఓసీలకు రూ.35వేలు సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీఓం దేవరాజైను ఆదేశించారు. స్థలం మంజూరు అయి నివాసాలు కట్టుకునేందుకు ఇష్టలేని లబ్దిదారులను గుర్తించి నోటీసులు ఇవ్వాలని కోరారు. ఎంపీడీఓ కెవై కీర్తి, హౌసింగ్ ఎఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
జగనన్న కాలనీలలో గృహాలు త్వరగా పూర్తి చేయించాలి – ఉగాది నాటికి లక్ష్యాలను చేరుకోవాలి – మండల ప్రత్యేక అధికారి ఉపేంద్రకుమార్
27
Jan