తాళ్లూరు మండలంలోని మాధవరం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు రైతులకు చెందిన 8ట్రక్కుల గడ్డి వాములు శుక్రవారం దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన జింకల ముసలారెడ్డి, నుసుం నాగిరెడ్డిలకు చెందిన 8 ఎకరాల గడ్డి వామి దగ్ధమైంది. సమాచారం అందుకున్న దర్శి అగ్నిమాపక వాహన సిబ్బంది మంటలను చల్లార్చారు. స్థానిక ఎస్సై బి.ప్రేమ్ కుమార్ ప్రమాద స్థలిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో దాదాపు లక్షన్నర మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోతున్నారు.
మాధవరంలో 8టక్కల గడ్డి వామి దగ్ధం -దాదాపు లక్షన్నర మేర నష్టం
27
Jan