కుప్పం నుండి శుక్రవారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టినయువగళం, పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుతూ తెలుగు యువత రాష్ట్రకార్యదర్శి గొల్లపూడి వేణుబాబు ఆద్వర్యంలో ప్రసిద్ది చెందిన శివరాంపురం సమీపానగల అగస్తేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ కుటుంబం పేరున పూజలు జరిపారు. పాదయాత్ర బాగా సాగిప్రజల సమస్యలను తెలుసుకునేలాఎలాంటి అడ్డంకులు లేకుండా దేవుని కృప వుండాలని కోరుకుంటూ పూజలుచేశారు. ఈ సందర్భంగా వేణుబాబు 51 కొబ్బరి కాయలను కొట్టి మొక్కు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోట నరసింహారావు, ఎఎంసీ మాజీ డైరెక్టర్ కెరామయ్య, ఇడమకంటి శ్రీనివాసరెడ్డి, తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టినయువగళం, పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుతూ టి. డి. పి శ్రేణుల ప్రత్యేక పూజలు -51 కొబ్బరి కాయలు కొట్టిన తెలుగు యువతరాష్ట్రకార్యదర్శి వేణుబాబు
27
Jan