60 మందికి వైద్య పరీక్షలు – క్యాన్సర్ పై అవగాహన

ముండ్లమూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం వైద్యాధికారులు వి జ్యోతి. ఎం జాస్మిన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 60 మందికి క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించారు .ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్యులు కే సాయి కృష్ణ మాట్లాడుతూ రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మేర మందులు అందజేశామన్నారు. అందులో 9 మందికి క్యాన్సర్ లక్షణాలు కనిపించడంతో హెచ్ సిజి ఎంఎన్ఆర్ హాస్పటల్ కి రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ తో బాధపడేవారు మా వైద్యశాలను సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేపట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ప్రత్యేకంగా వైద్య సేవ లు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామం ప్రాంతంలోని ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *