వాహనదారుడు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలుకి వెళ్లడం తప్పదని ఎస్సై ఎల్ సంపత్ కుమార్ అన్నారు. దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో స్థానిక బస్టాండ్ సెంటర్లో శనివారం రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తలకు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలన్నారు .కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రభుత్వం నిబంధన లుధిక్కరించి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా. తలకు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే 15 రోజులు పాటు రిమాండ్ విధించడం జరుగుతుందన్నారు. వాహనదారులు మధ్య సేవించి ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదాలు జరిగితే మీ కుటుంబాలు రోడ్లు పాలు అవుతాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క వాహనదారుడు జాగ్రత్త లు పాటిస్తూ ప్రయాణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
