దర్శి పట్టణం లో ఉద్యోగం రాలేదని బెల్లంకొండ కిరణ్ కుమార్ (22) అనే యువకుడు ఆత్మహత్య హత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని బాలాజీ వెంచర్ శనివారం చోటు చేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తు న్నా.. రాలేదనే మనస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
