రాష్ట్ర స్థాయి అండర్-17 హ్యండ్ బాల్ క్రీడా పోటీలను దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వీవీ రామాంజనేయులు అధ్యక్షతన, ఫిజికల్ డైరెక్టర్ నర్సింహారావు నేతృత్వంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి దాదాపు 500 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్, ఒంగో లు డివిజన్ ఉప విద్యాధికారి అనితారోజ్ హాజరై జెండాలను ఆవిష్క రించి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడోత్సవాలను ప్రాంభించారు. ఈ సంద ర్భంగా జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను దొనకొండలో నిర్వహించడం ఆనందంగా ఉంద న్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే యువతలో ఆరోగ్యకర మైన, సామాజిక, సాంస్కృతిక చైతన్యం పెంపొందించడం, శక్తివంతమైన, శారీరిక విద్యను ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో క్రీడలను నిర్వహిస్తుం దన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటమిలకు సంబంధం లేకుండా భవిష్య త్ ను దృష్టిలో పెట్టుకొని క్రీడలతో పాటు చదువులో కూడా రాణించి ఉ న్నతస్థాయిలో నిలవాలని కోరారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో క్రీడా కారుల కోసం అనేక సదుపాయాలతో ఒక క్రీడా సముదాయం ఏర్పాటుకు తమవంతుగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధి కారి విజయభాస్కర్ మాట్లాడుతూ… జిల్లాలో క్రీడలు, విద్య, పాఠశాలల అభివృద్ధికి వెంకాయమ్మ చేస్తున్న దాతృత్వం అభినందనీయమన్నారు. క్రీడాకారులు గెలుపోటమిలను సమానంగా తీసుకొని ముందుకు సాగా లన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు రావడం క్రీడలపట్ల వారి కున్న మక్కువ తెలుస్తోందన్నారు. కార్య క్రమంలో ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి, ఎంపీ డీవో వసంతరావునాయక్, వైసీపీ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, సర్పంచ్ కొంగలేటి గ్రేసత్న కుమారి, దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్, నాయకులు తమ్మనేని సుబ్బా రెడ్డి, ఐలూరి శ్రీనివాసులురెడ్డి, గొంగటి పోలిరెడ్డి, పీడీల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నత్తల కృష్ణ, పలు పాఠశాలల హెచ్ఎంలు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు…
రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ప్రారంభం సందర్భంగా దర్శి మండలం రా జంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులతో పాటు పాఠశాల హెచ్ఎం బాదరస్తాన్ ప్రదర్శించిన కోలాటం ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. తూర్పువెంకటాపురం జడ్పీ పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో చేపట్టిన విన్యాసం, కస్తూర్బా గాంధీ పాఠశాల బాలికలు ప్రదర్శించిన పిరమిడ్స్, దొనకొండ జడ్పీ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో అలరించాయి.
కోలాటమాడిన జడ్పీ చైర్పర్సన్…
క్రీడా పోటీలు సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ ఒంగోలు డివిజన్ ఉప విద్యాధికారి అనితారోజ్ కొద్దిసేపు విద్యార్థులతో కలిసి కోలా టమాడి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం వేదికపై వెంకాయమ్మ దేశభక్తి గీతాన్ని ఆలపించారు.
అబ్బురపరిచిన మార్చ్ ఫాస్ట్ ..
పోటీల సందర్భంగా రాష్ర్టంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడా కారులైన బాలురు, బాలికలు జిల్లాల వారీగా సంగీతం, బాణసంచా శబ్దాల మధ్య చేపట్టిన మార్చా పాస్ట్ ప్రదర్శన అబ్బురపరిచింది.






