వైద్యశాల అభివృద్ధి కమిటికి అభివృద్ధి, ఇతర నియామకాల విషయంమై సమాచారం ఇవ్వకుండా ఇష్టాను రీతిగా వ్యవహరిస్తున్న తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నంపై తాళ్లూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) తాటికొండ శ్రీనివాసరావు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసారు. వైద్యశాలలో జరుగుతున్న నియామకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సరియైన సమాచారం ఇవ్వక పోవటంపై ఆరోగ్య శాఖ మంత్రి రజనికి, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తూర్పు గంగవరం పీహెచ్సీలో ప్రభుత్వం మంజూరు చేసిన బయోకెమికల్ ఎన్జర్ను సోమవారం స్థానిక నాయకులతో కలసి ప్రారంభించినట్లు తన దృష్టికి వచ్చినదని చెప్పారు. ఈ విషయమే కాకుండా గతంలో ఆశ కార్యకర్తల నియామకం కూడ ఇష్టాను సారంగా చేసారని ఎంపీపీ ఆరోపించారు. అయితే ఈ విషయమై పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నంను వివరణ అడుగగా తాను ఎటువంటి పరికరాన్ని ప్రారంభించలేదని, త్వరలోనే ఎంపీపీని పిలిచి ప్రారంభిస్తామని తెలిపారు.
వైద్యశాల అభివృద్ధి కమిటీలో ప్రొటోకాల్ పాటించక పోక పోవటంపై ఎంపీపీ ఆగ్రహం- వైద్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎంపీపీ తాటికొండ
30
Jan