విద్యార్థులు గమనించండి ఇన్విజిలేటర్లు జాగ్రత్తగా రాయించండి- డి. దేవానందరెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు

ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి సైన్స్ పరీక్ష విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానందరెడ్డి పలు సూచనలు చేశారు . .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి సైన్స్ పరీక్ష లో ఒకే ప్రశ్నా పత్రములో ఫీజికల్ సైన్స్ ప్రశ్నలు మరియు బయోలాజికల్ సైన్స్ ప్రశ్నలు ముద్రించబడ్డాయి.

ఆ ప్రశ్నా పత్రములో భాగము -A (Part A) నందు ఫిజికల్ సైన్స్ ప్రశ్నలు క్రమసంఖ్య 1 నుండి 16 వరకు మరియు భాగము -B (Part-B) నందు బయోలాజికల్ సైన్స్ ప్రశ్నలు క్రమసంఖ్య 17 నుండి 33 వరకు ముద్రించబడ్డాయి.

జవాబులు వ్రాయటానికి విడివిడిగా OMR లు ఉన్న రెండు 12 పేజీల జవాబుపత్రములు ఒకే సారి అందించబడతాయి.

OMR ల పై ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ అని ముద్రించబడిఉంటాయి.

విద్యార్ధులు రెండు సబ్జెక్టులకు సమాధానాలు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫిజికల్ సైన్స్ జవాబుపత్రము లో ఫిజికల్ సైన్స్ సమాధానాలను మరియు బయోలాజికల్ సైన్స్ జవాబుపత్రములో బయోలాజికల్ సైన్స్ సమాధానాలను మాత్రమే రాయవలెను.

కావున ఇన్విజిలేటర్లు పరీక్ష ప్రారంభానికి ముందు గదిలోని పదవ తరగతి విద్యార్ధిని, విద్యార్ధులందరికి ఈ విషయంపై అవగాహన కల్పించి కేటాయించిన జవాబు పత్రంలో మాత్రమే సమాధానాలు రాసే విధంగా జాగ్రత్త వహించాలని కోరారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *