దర్శి మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే 196 జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎంపీపీ సుధాఅచ్చయ్య, సర్పంచ్ లు విజయ్, అంకాల శ్రీను, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
