గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పనులు చేపించాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా పనులు చేయించాలని సి ఎల్ అర్ సి కోర్సు డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. మండల కేంద్రమైన ముండ్లమూరులోని మంగళవారం రోజ్ గార్ దివస్ పథకంపై కూలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క కూలికి 272 రూపాయలు రావాలంటే ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు చేయాలని, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పనులు చేసినట్లయితే గిట్టుబాటు కూలి వస్తుందన్నారు. కూలీల మస్టర్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ కే కొండయ్య. టెక్నికల్ అసిస్టెంట్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ గోపన బోయిన శివ పార్వతి పిలుపు రాజు. తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *