ఘనంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు76వ జన్మదిన వేడుకలు గురువారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శంకరాపురం గ్రామ సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కూరపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజ లకు సుపరిపాలన అందించాలంటే నారా చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అందరి కష్ట సుఖాలు తెలుసుకొని వారి సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అలాంటి ముఖ్యమంత్రితోనే సుపరిపాలన సాధ్యమన్నారు. రైతు ,ప్రజల, మహిళ సంక్షేమ లక్ష్యంగా అడుగులు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో చాగంటి రాంబాబు, తేలుకుట్ల రాంబాబు, మంచా నాగేశ్వరరావు, మీనిగనందగోపాల్, తాళ్లూరి వెంకటేశ్వర్లు, బరిగే రామ లక్ష్మయ్య, కొండలు, పాపారావు, తమ్మినేని బ్రహ్మం, శ్రీను, మేదరమెట్ల రాంబాబు, మేడికొండ హనుమంతరావు, మేడికొండ శివశంకరరావు, మేడికొండ రామాంజనేయులు, గంగినేని రామకోటయ్య, నంబూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *