గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి అన్నారు. సోమవరప్పాడు గ్రామంలో బుధవారం గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలతో జీవితాలపై ప్రభావంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… గంజాయి మత్తు పదార్థాల విక్రయిస్తే జైలు పాలు అవుతారని, కుటుంబాలు చిన్నా భిన్నం అవుతాయని చెప్పారు. గతంలో గంజాయి విక్రయిస్తే మార్పు వచ్చిన కుటుంబాలపై సక్సస్ అయిన విధానాన్ని వివరించారు. పరివర్తనతో ప్రతి ఒక్కరూ మారాలని చెప్పారు. కార్యక్రమంలో దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సై ప్రేమ్ కుమార్ లు పాల్గొన్నారు.

