తుఫాన్ సందర్భంగా ముంగమూరు రోడ్లో ఏర్పాటు చేసిన పశు రీహెబిటేషన్ సెంటర్ను మంగళవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ప్రత్యేక అధికారి పిఎస్ ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ , ఎస్పీ మలికగర్గ్ సందర్శించారు. ఆవుల యజమానులకు జిల్లా పశుసంవర్థఖ శాఖాధికారి డాక్టర్ బేణిరాణి ఆధ్వర్యంలో మూడు టన్నుల ఎండు మేత, 500 కేజీల పశువుల దాణను ఉచితంగా పంపిణీచేసారు. మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆవులను ప్రేమతో దాణను తినిపించారు. డిఎల్డీఏ కార్యనిర్వాణాధికారి డాక్టర్ కాలేషా, పశువైద్యుల, సిబ్బంది పాల్గొన్నారు.


