మానవునికి మట్టికి అత్యంత అవినాభావ సంబంధం ఉందని జిల్లా వ్యయసాయశాఖాధికారి ఎస్ శ్రీనివాసరావు అన్నారు. వెంగముక్కపాలెంలో మంగళవారం ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా రైతులకు నేల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 70శాతం మంంది ప్రజలు నేలను నమ్ముకునే జీవనం సాగిస్తున్నారని అన్నారు. భావి తరాల కోసం నేల తల్లిని కాపాడుకోవాల్సిన ఆవశ్యతకను వక్తలు వివరించారు. ఒంగోలు ఎడీఏ రమేష్ బాబు, సాయిల్ టెస్టింగ్ ఎడీఏ సుచరిత తదతరులు పాల్గొని నేల సారవంతం కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, నేలలో పౌషకాలను బట్టి ఇవ్వాల్సిన పోషకాలను గురించి తెలిపారు.
