మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధి నిషేదించటం మరియు వారి పునరావాస చట్టం- 2013 అమలుపై ప్రత్యేక దృష్టి సారించి నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో మాన్యువల్ స్కావెంజింగ్ నిషేదంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కె. శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 30న నిర్వహించిన సమావేశంలో తీర్మానాలకు సంబంధించిన తీసుకున్న చర్యలపై సమీక్షించారు. సోషల్ వర్కర్ మిట్నాసల బెంజిమన్ మాట్లాడుతూ …..ప్రభుత్వ జనరల్ హాస్పటల్ నందు సఫాయి కర్మచారీలు మరియు సెక్యూరిటీ గార్డ్స్ ను ఎపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సుడ్ సర్వీస్(ఎపీసీఓఎస్)లో కలపాలని కోరారు. ఎజెన్సీ వచ్చినప్పటి నుండి రూ. 9వేలు మాత్రమే చెల్లిస్తున్నారని, ఆరు నెలలకు ఒక సారి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు పెంచవలసి ఉన్నదని, రెండు నెలల నుంచి జీతాలు సక్రమంగా అందించడం లేదని తెలిపారు . సఫాయి కర్మచారీలను ఏ పద్దతిలో తీసుకున్నారో వివరాలు తెలపాలని, ఆపరేషన్ థియోటర్లో పనిచేస్తున్న వారికి సిఫ్ట్ డ్యూటీలు ఏర్పాటు చెయ్యాలని కోరారు. ఎపీఎస్ఆర్టీసీలో శానిటేషన్ వర్కర్స్ నబీ 23 మందిని, గ్యారేజిలో ఐదుతో పాటు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వారిని ఎపీసీఓఎస్ లో కలపాలని కోరారు. ఎపీఎస్ఆర్టీసి లో ఈఎస్ఐ మంజూరు చెయ్యాలని కోరారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమం మరియు సాధికారిత అధికారి ఎన్. లక్ష్మా నాయక్, కమిటీ సభ్యులు జిల్లా పంచాయితీ అధికారి జీవి నారాయణ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ ఎం. వెంకటేశ్వర రావు, మార్కాపురం మున్సిపల్ కమీషనర్ బి. ఎస్ గిరికుమార్, పంచాయితీ రాజ్ ఎస్ఈ కె కొండయ్య, జిల్లా హౌసింగ్ పీడీ పేరయ్య, డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేదించటంపై ప్రత్యేక దృషి – పునరావాస చట్టం-2013పై సమీక్ష – పాల్గొన్న జిల్లా సంయుక్త కలెక్టర్ కె. శ్రీనివాసులు, జిల్లాలోని పలు విభాగాల అధికారులు
14
Dec