మిచౌంగ్ తుఫాన్ నేపధ్యంలో రైతుల బాధ వర్ణణాతీతమని, చేతికి వచ్చిన పంట తీవ్రంగా నష్టపోయారని వారిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, త్వరితగతిన రైతులు నష్టపోయిన వివరాల నివేదిక తయారుచేసి యెడల కేంద్ర ప్రభుత్వమునకు నివేదించడం జరుగుతుందని జాతీయ పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం వలన నీటమునిగిన అనేక ప్రాంతాలలో పొగాకు పంటను పరిశీలించడానికి ఒంగోలుకు విచ్చేసిన యశ్వంత్ కుమార్ భారతీయ జనతాపార్టి జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి తో కలసి ఒంగోలు అసెంబ్లీ పరిధిలో త్రోవగుంట, ముక్తినూతలపాడు, చీర్వానుప్పలపాడు, తదితర గ్రామాలలోని పొలాలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడుతూ నష్టపోయిన పంటను అంచనావేసి కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని, ప్రతి రైతుకు పూర్తి పరిహారం వచ్చేవిధముగా కృషిచేస్తానని హామీఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పొగాకు బోర్డ్ చైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు.జిల్లా అధ్యక్షులు శివా రెడ్డి, పొగాకు బోర్డు మెంబెర్ బోడపాటి బ్రాహ్మ్మయ్య, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, రైతులు తదితరులు నీట మునిగిన పొగాకు పంటలను పరిశీలించారు.




