ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునే శక్తి ఉంటుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మెనేజర్ సుభాషిణి అన్నారు. నాగులుప్పలపాడు మండలం పోతవరంలో అంజిరెడ్డి అను రైతు ప్రకృతి వ్యవసాయం చేసిన మిరప, కంది, మినుము, కూరగాయలను పరిశీలించారు. తుఫాన్ వలన ఆయా పంటలకు పెద్ద దెబ్బలేదని చెప్పారు. సస్యరక్షణకు ఘన జీవామృతం, వేప పిండి మొక్కల మొదల్లో వెయ్యాలని, పుల్లటి మజ్జిగ స్పై చెయ్యాలని సూచించారు.

