రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు బిజేపికి పట్టంకట్టే విధముగా పటిష్టమైన నాయకులకు ప్రజలకు వారధిగా పలు విభాగాలకు సమర్ధవంతమైన కార్యకర్తలకు పదవి బాద్యతలు బదలాయిస్తూ పార్టీ బలోపేతమునకు భాజపా జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి కృషిచేస్తున్నారు.
ఆయా నియామకాలలో భాగముగా పార్టీలో అందరినీ కలుపుకుపోగల మరియు సీనియర్ సభ్యులైన తిరుమల శెట్టి శ్రీరాములను ఒంగోలు నగర 4వ మండల అధ్యక్షులు గా మరియు జిల్లా ఓబీసీ మోర్చాామాజీ ఉపాధ్యక్షులు కటారి సుధాకర్ యాదవ్ ను ప్రకాశం జిల్లా విశ్వకర్మ యోజన కన్వినర్ గా బాధ్యతలలో నియమించారు.
గురువారం ఉదయం స్థానిక విష్ణుప్రియా కన్వెంషన్ హాలులో వారికి నియామక పత్రాలను అందించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టి గెలుపుతో పాటు మెజారిటీ సాధించే విధముగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను చిట్టచివరి లబ్ధిదారుకీ చేరేవిధముగా ప్రచారం చేయాలని, అన్ని విభాగాలను అనుసంధానం చేసుకొంటూ కార్యాచరణ చేయాలని సూచించారు.
కార్యక్రమములో ఒంగోలు అసెంబ్లీ కన్వినర్ యోగయ్య యాదవ్, ఒంగోలు పార్లమెంట్ కన్వినర్ సెగ్గం శ్రీనివాసరావు, స్కిల్ ఇండియా కన్వినర్ పిన్నట్టి తిరుమల రావు, ఓబీసీ జిల్లా కార్య దర్శి కుంచాల వెంకట శివ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

