ప్రజోపయోగమైన కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి BRS పార్టీ ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారంఅమీర్ పేట లోని 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్యక్రమం క్రింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లను ప్రకటించిందని, వాటిని వెంటనే అమలు చేసి చిత్తశుద్ధి ని చాటుకోవాలని చెప్పారు. మహాలక్ష్మి కార్యక్రమం క్రింద మహిళలకు 2500 రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీ, 4 వేల రూపాయల పెన్షన్, 500 రూపాయల కే గ్యాస్ సిలెండర్ పంపిణీ ల అమలు కోసం అర్హులు ఎదురు చూస్తున్నారని అన్నారు. వెంటనే అమలు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ దశరథ, ఆరోగ్య శ్రీ అధికారి దశరథ సింగ్, తహసీల్దార్ భీమయ్య గౌడ్, కూకట్ పల్లి డిపో DM ఇషాక్, BRS పార్టీ ఇంచార్జి హన్మంతరావు, జనరల్ సెక్రెటరీ సంతోష్, నాయకులు అశోక్ యాదవ్, గులాబ్ సింగ్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, గోపిలాల్ చౌహాన్, రాణి కౌర్, కర్నాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

