ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. లోక కళ్యాణం కోసం, మన భాగ్యనగరం లోనే తొలి సారిగా శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి వీధి పళ్ళెం మహోత్సవాన్ని గతంలో ఎన్నడూ జరపని రీతిలో నిర్వహిస్తున్నట్లు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆరాధ్య జనసేవా వాహిని ట్రస్టు చైర్మన్ తాడికొండ విజయ కుమార్ తెలియజేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరించారు..
*ముందుగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ సాహిత్యంలో నేమాని పార్థ సారథి స్వరపరచిన ” శ్రీ వీర భద్రాయ నమః శివాయ శ్రీ వీర భద్రాయ నమః శివాయ హస్సరభ శరభ…అంటూ సాగే పాటను ఆన్ లైన్ ద్వారా ఆవిష్కరించారు…ఈ సందర్భంగా సామవేదము షణ్ముఖశర్మ మాట్లాడుతూ
లోక కల్యాణం కోసం తాడికొండ విజయ కుమార్ గారి నేతృత్వంలో మన భాగ్యనగరలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం ఎంతో సంతోషం గా వుందన్నారు.
అనంతరం తాడికొండ విజయ కుమార్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో ఈనెల గురువారం 14వ తేదీ నుండి ఆదివారం 17వ తేదీ వరకు నాల్గు రోజుల పాటు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం తో పాటు వీధి పళ్ళెం అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
*లోక కళ్యాణార్థం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని.కోరారు. సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్విస్తున్నట్లు ఆయన తెలిపారు .
వీధి పళ్ళెం ఉత్సవం ప్రధానమైంది. డిసెంబర్ 17 న రాత్రి జింఖానా గ్రౌండ్స్ నుండి వేలాది మంది ఆరాధ్యులు వీర భద్రుడు, ఇతర గణాల అలంకరణ తో కత్తులు, దాలు డప్పులు, కాగడాల తో పెద్ద ఎత్తున “అశ్శరభ శరభ శరభ ” అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా కల్యాణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభవారి, సాంఘిక సేవా కార్యక్రమాలు, మరెన్నో ఆకర్షణలు, అలంకరణలతో జింఖానా గ్రౌండ్స్ సిద్దమవుతోంది అన్నారు.
ఉచిత వైద్య శిబిరాలు,రక్త దానం శిబిరాలు కూడా కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు*.
*మన భాగ్యనగరం లో తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో జరిగే శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణ వీధి పళ్ళెం మహోత్సవం లో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని తిలకించి, అన్న ప్రసాదాలు స్వీకరించి తరించమన్నారు.
తాడికొండ విజయ కుమార్ తో పాటు , ట్రస్టు సభ్యులు సుధాకర్ గుప్తా, ఇవటూరి కైలాష్ , తాడికొండ శశి భూషణ, విడియాల శశిధర్ , యమునా పాఠక్ , దుర్గాప్రసాద్ ,తాడికొండ శివకుమార్ బెల్ సన్ తాజ్ హోటల్ అధినేత సంజీవరావు తదితర కార్య నిర్వాహక సభ్యులు పాల్గొని ప్రసంగించారు
నాల్గు రోజుల పాటు జరిగే కార్యక్రమాలు.
14న శ్రీ శైల దేవస్థానం వారి చే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం
- మురముళ్ళ దేవస్థానం వారి చే శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి కళ్యాణం
- శ్రీ బొంతపల్లి దేవస్థానం వారి వారి చే కళ్యాణం
- కురవి దేవస్థానం వారి చే కళ్యాణం సామవేదం షణ్ముఖశర్మ , బంగారయ్య శర్మ తో ప్రవచనాలు. తనికెళ్ళ భరణి చే ఆటకథరా శివ గానం.
ప్రముఖ హరికథా భాగవతార్ శ్రీ సింహాచల శాస్త్రి చే హరికథా.
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు గాయకుడు పార్థ సారధి ఆధ్వర్యంలో లో ఎస్.పి శైలజ, ఎస్.పి.చరణ్ బృందం చే సంగీత కార్యక్రమం.
చివరి రోజు 17న రాత్రి జింఖానా గ్రౌండ్స్ నుండి మారెడుపల్లి సర్వేశ్వరాలయం వరకు వీధి పళ్ళెం మహోత్సవం ఊరేగింపు నిర్వహిస్తారు.
