అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో సాధించిన రాష్ట్రంలో కలసి కట్టుగా ప్రగతి సాధించటమే ఆయనకు నిజమైన ఘన నివాళి అని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో సీవిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాగ సుజాత, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ పై ఎం ప్రసాద్ రెడ్డిలు పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరనిరహార దీక్ష చేసి దానికి సాధించిన ఘనత పొట్టి శ్రీరాములుకుఏ దక్కుతుందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడ ఆయన పాత్ర మరువలేదని దని అన్నారు. ఆయన ఆశయాలను స్పూర్తిగా తీసుకుని రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమిస్తోందని వివరించారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎన్నటికి మరువలేదని అన్నారు. హరిజనోద్ధరణ కోసం, హరిజనులు దేవాలయ ప్రవేశం కోసం పొట్టి శ్రీరాములు ఎంతో కృషి చేసారని అన్నారు. అమరజీవి ఆశయ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం నేడు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానిదే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజలి. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, ఆర్ ఓ విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్, బీసీ కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వరరావు, ఎఎంసీ చైర్మన్ కట్టా రామచంద్రా రావు, తహసీల్దార్ మురళి, పలు



