ప్రభువైన ఏసుక్రీస్తు జననంతో లోకానికి రక్షణ వచ్చిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. దర్శి లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం దర్శి రీజియన్ గ్రేస్ పాస్టర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఐక్య సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సెమీ క్రిస్మస్ సందేశాన్ని ఆర్కే మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవ ఆర్కే చింత పల్లి అందించారు. ప్రజలందరూ కరుణ, శాంతి, దయ, – ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని దర్శి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆకాంక్షించారు. అంనతరం దర్శి రీజియన్‌లోని ఐదు మండలాల పాస్టర్స్ సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 300 మంది పాస్టర్లకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు యూనియన్ తరఫున దుస్తులు అం దజేశారు. దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి, మాజీఎంపీపీ ఇత్తడి దేవదానం, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా, కురిచేడు జెడ్పీటీసీ నుసుం. వెంకట నాగిరెడ్డి, దర్శి రీజియన్ గ్రేస్ పాస్టర్స్ డెవలప్మెంటు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుంటూరు కృష్ణా నందం, నగిరికంటి ఏసన్న, దర్శి, కురిచేడు, దొనకొం డ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల అధ్యక్షులు లూకాలాలు, షేక్ ఖాశీం, డి. నతానియేలు, ఇస్సాకు, పి. బాలన్న, పౌల్, జి.రాజారత్నం, ఇమ్మానియేలు, సంతోష్‌కుమార్, జాన్ పాల్గొన్నారు.
పాటపాడి ఉత్సాహ పరిచిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ
సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో బూచేపల్లి వెంకాయమ్మ ఏసయ్య బంగారు ఏసయ్యా… అంటూ పాటపాడి పాస్టర్స్న్స ఉత్సాహపరిచారు. పాస్టర్లు వెంకాయమ్మను, శివప్రసాదొడ్డిలను దీవించారు. ఈ నెల 21న జరగనున్న జగనన్న పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోని 5 మండలాల పాస్టర్లకు నూతన వస్త్రాలను పొదిలి రోడ్‌లోని బూచేపల్లి నూతన గృహంలో బహూకరిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.



